Nalgonda: హుజూర్ నగర్ లో ఈసారి కచ్చితంగా గెలుస్తాం: మంత్రి కేటీఆర్

  • హుజూర్ నగర్ నుంచి ‘కాంగ్రెస్’ని తరిమిగొడతాం
  • గులాబీ సైనికులు సవాల్ గా తీసుకోవాలి
  • ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి

హుజూర్ నగర్ లో త్వరలో జరగనున్న ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండలో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ తరపున హుజూర్ నగర్ లో ఈసారి తమ పార్టీ గెలుపు ఖాయమని, ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

 హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమిగొడతామని, గులాబీ సైనికులు సవాల్ గా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. నల్లగొండను కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని, ‘రైతు బంధు’ పథకం ఇచ్చిన కేసీఆర్ కావాలా? ఫ్లోరైడ్ సమస్యకు కారణమైన కాంగ్రెస్ పార్టీ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలు గెలిచినా ప్రజలకు వాళ్లు ఒరగబెట్టేదేమీ లేదని అన్నారు.  

Nalgonda
Huzurunagar
Minister
Ktr
  • Loading...

More Telugu News