Ghantasala: ఘంటసాల అలా అనడం ఆయన శ్రీమతికి చాలా బాధ కలిగించిందట!
- ఘంటసాలను పరిచయం చేసింది నాగయ్యగారే
- నాగయ్య గారి గురించి ఘంటసాలగారే చెప్పారు
- సుశీల గారి ద్వారా నాకు తెలిసిందన్న ఈశ్వర్
రచయిత .. సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, ఘంటసాలను గురించి ప్రస్తావించారు. 'స్వర్గసీమ' సినిమా ద్వారా గాయకుడిగా ఘంటసాలగారిని పరిచయం చేసిందే చిత్తూరు నాగయ్య గారు. అలాంటి నాగయ్య గారు చనిపోయారు .. అప్పుడు నేను 'విజయచిత్ర' పత్రికలో పనిచేస్తున్నాను. అందువలన చిత్తూరు నాగయ్య గారి గురించి, ఆయనతో ఘంటసాలగారికి గల అనుబంధాన్ని గురించి అడిగి తెలుసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్లాను.
చిత్తూరు నాగయ్య గారి గురించి తనకి తెలిసిన విషయాలను ఘంటసాలగారు నాతో పంచుకున్నారు. అప్పటికి ఘంటసాలగారి ఆరోగ్యం కూడా బాగోలేదు. నాగయ్యగారికి సంబంధించిన మేటర్ తీసుకుని నేను అక్కడి నుంచి వచ్చేసిన తరువాత, 'కొన్నాళ్ల తరువాత నా గురించిన మేటర్ తీసుకోవడానికి కూడా ఈశ్వర్ ఇలాగే అందరి దగ్గరికి వెళతాడు' అని ఘంటసాలగారు తన శ్రీమతి సావిత్రమ్మ గారితో అన్నారట. ఆ మాటకి ఆమె చాలా బాధపడిపోయి .. ఆ బాధను సుశీలమ్మగారితో పంచుకున్నారట. ఆ తరువాత ఏవీఎమ్ స్టూడియోలో కలిసినప్పుడు సుశీలగారు నాకు ఆ విషయం చెప్పారు" అని అన్నారు.