Hyderabad: మెట్రో ప్రమాదంపై కేటీఆర్ పూర్తి వివరాలతో ప్రజల ముందుకు రావాలి: కాంగ్రెస్ నేత శశిధర్ రెడ్డి డిమాండ్

  • అమీర్ పేట మెట్రో వద్ద ప్రమాదం
  • వివాహిత మౌనిక దుర్మరణం
  • బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలన్న శశిధర్ రెడ్డి

హైదరాబాద్ లోని అమీర్ పేట మెట్రో రైల్వేస్టేషన్ ప్రమాద ఘటనలో మౌనిక అనే వివాహిత మృతి చెందడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు. మెట్రో పిల్లర్ల పెచ్చులు ఊడిపడిన ఘటనలో నిర్మాణ నాణ్యతపై సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. ఈ ఘటనతో మెట్రోకి ఎలాంటి సంబంధం లేదని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెబుతున్నారని, దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్ పూర్తి వివరాలతో ప్రజల ముందుకు రావాలని శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

Hyderabad
Metro
Shashidhar Reddy
  • Loading...

More Telugu News