Sensex: నేడు కూడా దూసుకుపోయిన మార్కెట్లు

  • కార్పొరేట్ ట్యాక్స్ ను తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన
  • 1,075 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 329 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

దేశీయ తయారీరంగానికి చేయూతనిచ్చే క్రమంలో కార్పొరేట్ ట్యాక్స్ ను తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,075 పాయింట్ల లాభంతో 39,090కి ఎగబాకింది. నిఫ్టీ 329 పాయింట్లు పెరిగి 11,603కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (9.16%), ఎల్ అండ్ టీ (9.00%), ఏసియన్ పెయింట్స్ (7.93%), ఐటీసీ (7.01%), యాక్సిస్ బ్యాంక్ (6.97%).

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-4.99%), టాటా మోటార్స్ (-4.39%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-4.15%), ఎన్టీపీసీ (-3.25%), భారతి ఎయిర్ టెల్ (-3.05%).

  • Loading...

More Telugu News