Budda Venkanna: అవినీతి సాక్ష్యాలు నీ సాక్షిలో మాత్రమే ఉబుకుతాయి శకుని మామా: బుద్ధా వెంకన్న

  • అబద్ధాలు, శవ రాజకీయాలతో వైసీపీ గెలిచింది
  • ప్రజలపై జగన్ కు ప్రేమ అనేది ఉందా?
  • జగన్ గురించి అంతర్జాతీయ ఆర్థిక కుంభకోణాల సమ్మిట్ లో చర్చిస్తున్నారు

పోలవరం డ్యామ్ పునాదుల నుంచి అవినీతి సాక్ష్యాలు ఉబికి వస్తున్నాయంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. 'అవినీతి సాక్ష్యాలు నీ సాక్షిలో మాత్రమే ఉబుకుతాయి తప్ప ఇంకెక్కడా కాదు శకుని మామా' అంటూ ఆయన విమర్శించారు. 'అబద్ధాలు ప్రచారం చేసి, శవ రాజకీయాలు చేసి వైసీపీ గెలిచింది తప్ప... ప్రజలపై జగన్ కు ప్రేమనేది ఉందా? అసలు?' అని ప్రశ్నించారు. అందుకే మా దగ్గరకొస్తే మొహం మీద ఉమ్మడం కాదు... చెప్పుతీసుకుని కొడతామని ప్రజలు అంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'రివర్స్ టెండరింగ్, రాలిపోయిన రత్నాల మీద ఎన్ని రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయనే నిజానిజాలను పక్కనపెడితే... 46 ఏళ్ల పసిబాలుడైన తుగ్లక్ జగన్ గురించి భారతదేశంలోని న్యాయ కళాశాలల పుస్తకాలలో, అంతర్జాతీయ ఆర్థిక కుంభకోణాల సమ్మిట్ లలో పుంఖానుపుంఖాలుగా చర్చిస్తున్నారు శకుని మామా' అంటూ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.

Budda Venkanna
Telugudesam
Jagan
YSRCP
Vijayasai Reddy
  • Loading...

More Telugu News