street dog: సభా వేదికపై వీధి కుక్క ప్రత్యక్షం.. ఇంటర్వ్యూ చేసిన యాంకర్!

  • ఐఫా 20వ ఎడిషన్‌ వేడుకల్లో ఘటన
  • వేదికపై  తళుక్కుమన్న శునకం
  • షేక్‌హ్యాండ్‌ తీసుకుని మాట్లాడిన నటి అదితి భాటియా

అతిరథ మహారథులున్న మహోత్సవం అది. తారల తళుక్కులు...ప్రముఖుల ప్రసంగాలు...వెలుగు జిలుగుల వేదికపై విస్తుగొలిపే ఏర్పాట్లు...అటువంటి సమయంలో ఎలావచ్చిందో వేదికపైకి ఓ వీధి కుక్క వచ్చింది. నిర్వాహకులు దాన్ని తరిమేస్తే విశేషం ఏముంది? అప్పటికే అక్కడ వ్యాఖ్యాతగా ఉన్న అదితి భాటియా ఆ కుక్కను ఇంటర్వ్యూ చేసింది.  

ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండు రోజుల క్రితం ముంబై వేదికగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (ఐఫా) 2019, 20వ ఎడిషన్ వేడుకలు జరిగాయి. ఓ వీధి కుక్క వేదికపైకి వచ్చి గ్రీన్‌ కార్పెట్‌ మీద అటు ఇటు పచార్లు చేస్తోంది. దీన్ని గమనించిన నటి అదితి భాటియా మైక్‌ పట్టుకుని కుక్క వద్దకు వెళ్లారు. కుక్కను పలకరించగానే అది ప్రేమగా ఆమెతో కరచాలనం చేసింది. అనంతరం ఆమె కొన్ని ప్రశ్నలు అడగ్గా సదరు శునకం మౌనంగా తల ఆడించింది. ఈ వీడియోను అదితి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేయగా రెండు రోజుల్లో 6 లక్షల మంది చూశారు.

street dog
interview
adhiti bhatiya
mumbai
netigens
  • Loading...

More Telugu News