New Delhi: కారుపై పడ్డ జరిమానా కట్టేందుకు బైక్ పై వస్తే, అది కూడా సీజ్!
- న్యూఢిల్లీలో ఘటన
- నిబంధనలు పాటించలేదని కారుకు జరిమానా
- చెల్లించేందుకు వచ్చిన స్నేహితుని బైక్ కూడా సీజ్
తన కారుపై పడ్డ జరిమానాను చెల్లించేందుకు వెళ్లడానికి స్నేహితుని సహాయాన్ని అర్ధిస్తే, అతని బైక్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళితే, నోయిడా సమీపంలోని సెక్టార్-62లో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న వేళ, ఓ కారును ఆపి, దానికి రిఫ్లక్టర్ లేదంటూ, జరిమానా వేశారు. దాన్ని ఆర్డీఓ వద్ద చెల్లించాలని సూచించారు. దీంతో అతను తన మిత్రుడిని సాయం కోసం పిలువగా, ఆ టూ వీలర్ కు నంబర్ ప్లేట్ లేదని గమనించిన అధికారులు ప్రశ్నించారు. తాను రెండు నెలల క్రితం వాహనాన్ని కొన్నానని, ఇంకా రిజిస్ట్రేషన్ చేయించలేదని చెప్పడంతో, ఆ బైక్ ను కూడా సీజ్ చేసి జరిమానా విధించారు. కాగా, ఇదే తరహా ఘటన నోయిడా సమీపంలోని నాలెడ్జ్ పార్క్ వద్ద కూడా జరిగింది.