Madhav Apte: భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే కన్నుమూత!

  • కొంతకాలంగా అనారోగ్యం
  • చికిత్స పొందుతూ మృతి
  • 7 టెస్టులాడి రెండు సెంచరీలు చేసిన మాధవ్

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు మాధవ్ ఆప్టే ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. 1950వ దశకంలో భారత టెస్టు జట్టులో ఓపెనర్ గా సేవలందించిన మాధవ్, ఏడు టెస్టులు ఆడారు.

 వెస్టిండీస్ కు చెందిన నాటి దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్‌ కింగ్‌, జెర్రీ గోమెజ్‌, ఫ్రాంక్‌ వారెల్‌ లను దీటుగా ఎదుర్కొంటూ రెండు సెంచరీలు సాధించారు. మొత్తంమీద 67 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ఆయన 3,336 పరుగులు చేశారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఇదే క్లబ్ తరఫున సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల వయసులోనే మ్యాచ్ లు ఆడి సత్తా చాటారు. మాధవ్ ఆప్టే మృతికి బీసీసీఐతో పాటు, పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు.

Madhav Apte
Passes Away
India
Cricket
  • Loading...

More Telugu News