homeguard family: అదృశ్యమైన హోంగార్డు కుటుంబం విజయవాడలో ప్రత్యక్షం!

  • హోంగార్డు రవి కుటుంబం ఆచూకీ లభ్యం
  • చనిపోతామంటూ సూసైడ్‌నోట్‌ రాసిన దంపతులు
  • నిన్నటి నుంచి కనిపించక పోవడంతో వెతుకులాట

ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సూసైడ్‌ నోట్‌ రాసి కనిపించకుండా పోయిన హోంగార్డు రవి కుటుంబం ఆచూకీ లభించింది. విజయవాడలో రవి కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని సూర్యాపేటకు తీసుకువచ్చారు.

పోలీసుల కథనం మేరకు... తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని తుంగతుర్తికి చెందిన రవి పెద్ద కుమార్తె గత ఏడాది చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రమనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి మనోవేదనకు లోనైన రవి, అతని భార్య పద్మ కూతురు చనిపోయి ఏడాదైనా మర్చిపోలేకపోతున్నామని, అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పి మిగిలిన ఇద్దరు కూతుర్లను తీసుకుని తుంగతుర్తి నుంచి నిన్న ఉదయం అదృశ్యమయ్యారు.

దీంతో టెన్షన్‌ మొదలయ్యింది. అయితే రవి దంపతులు వాడపల్లిలో పెద్ద కుమార్తెకు పిండ ప్రదానం చేశాక బంధువులకు ఫోన్‌ చేశారు. తాము చనిపోతున్నామని, అప్పు తీర్చాలని కోరారు. దీంతో బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రవి కుటుంబాన్ని విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు.

homeguard family
suicde note
traced at vijayawada
tungturthi
Suryapet District
  • Loading...

More Telugu News