Sonia Gandhi: చిదంబరాన్ని కలిసేందుకు.. తీహార్ జైలుకు వెళ్లిన మన్మోహన్, సోనియా!

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణను ఎదుర్కొంటున్న చిదంబరం
  • ప్రస్తుతం జైలులో ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి
  • 20 నిమిషాల పాటు మాట్లాడిన సోనియా, మన్మోహన్

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటూ, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరాన్ని, ఈ ఉదయం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ కలుసుకున్నారు. ఉదయం తీహార్ జైలుకు వచ్చిన వీరు, లోనికి వెళ్లి చిదంబరంతో దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడారని తెలుస్తోంది. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సోనియా, పార్టీ అండగా నిలుస్తుందని, కష్టకాలం త్వరలోనే ముగుస్తుందని ధైర్యం చెప్పినట్టు సమాచారం. సోనియా, మన్మోహన్ సింగ్ ల రాకతో తీహార్ జైలు వద్ద సందడి నెలకొనగా, పోలీసులు అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Sonia Gandhi
Manmohan Singh
Tihar Jial
Chidambaram
  • Loading...

More Telugu News