Jagan: జగన్ హెలికాప్టర్ లాండింగ్ విషయంలో వివాదం!

  • ఈ ఉదయం గన్నవరం బయలుదేరిన జగన్
  • ల్యాండింగ్ కు అనుమతి లేదని సమాచారం
  • చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సీఎంఓ ఆదేశం

ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తాడేపల్లిలోని తన నివాసం నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన వేళ, గన్నవరం విమానాశ్రయంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలో వివాదం చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. హెలికాప్టర్ ల్యాండింగ్ కు సమస్యలు ఉన్నాయని అధికారులు సమాచారం ఇవ్వడంతో సీఎం కార్యాలయం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

అసలు సమస్య ఏంటని ప్రశ్నించిన అధికారులకు, విమానాశ్రయ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై విచారించి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సీఎంఓ ఆదేశాలు పంపింది. ఆ మరుక్షణమే సర్వే శాఖ డీఐ వేణుకు కలెక్టర్ నుంచి నోటీసులు వెళ్లాయి. ఈ మొత్తం ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. మరికాసేపట్లో హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి లభిస్తుందని, ఆ వెంటనే జగన్ బయలుదేరుతారని సమాచారం.

Jagan
Helecopter
Gannavaram
Landing
  • Loading...

More Telugu News