Pawan Kalyan: వేదికపైకి దూసుకొచ్చిన అభిమాని... సెక్యూరిటీ సిబ్బందిని వారించిన పవన్ కల్యాణ్

  • సైరా ప్రీరిలీజ్ వేడుకలో పవన్ ప్రసంగం
  • వేదికపైకొచ్చి అభిమాని పాదాభివందనం
  • అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది 

సైరా ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. రాజమౌళి గెలిచినా తమకు ఆనందమేనని, ఆయన విజయాలను తమ విజయాలుగా భావించి సంతోషిస్తామని చెబుతూ, అందుకు కారణం సినిమాయేనని, ఇది మన సినిమా, ఇది మన సినిమా జాతి అని భావిస్తామని తెలిపారు. తన ప్రసంగాన్ని కొనసాగించే క్రమంలో రాకెట్ లాగా వేదికపైకి దూసుకొచ్చిన ఓ అభిమాని పవన్ కు పాదాభివందనం చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ అభిమానిని బలవంతంగా అక్కడ్నించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

'మీరందరూ వెళ్లిపోండి' అంటూ పవన్ వారికి హిందీలో చెప్పినా ఆ సెక్యూరిటీ సిబ్బంది వినకపోవడంతో గట్టిగా అరిచారు. "ఆప్ లోగ్ చలే జాయియే భాయ్" అంటూ మొదట తక్కువ టోన్ తో చెప్పిన జనసేనాని ఆ తర్వాత "చలీయే ఆప్" అంటూ గట్టిగా అరవడంతో సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి తగ్గారు. దాంతో ఆ అభిమాని పవన్ ను ఆనందంతో హత్తుకుని మురిసిపోయాడు. అనంతరం పవన్ తన ప్రసంగం కొనసాగించారు.

Pawan Kalyan
Syeraa
Hyderabad
  • Loading...

More Telugu News