Pawan Kalyan: రాజమౌళి విజయాలు సాధించినా, రికార్డులు బద్దలు కొట్టినా మాకు ఆనందమే: పవన్ కల్యాణ్

  • సైరా ప్రీరిలీజ్ వేడుకలో పవన్ వ్యాఖ్యలు
  • అందరి విజయాలు తమవిగానే భావిస్తామని వెల్లడి
  • ఆ సంస్కారం అన్నయ్యే నేర్పించాడన్న పవన్

బాల్యంలో తాను అన్నయ్య చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయన గొప్పతనం చూసి ఆశ్చర్యపోయేవాడ్నని తెలిపారు. అన్నయ్య సినిమాలు రికార్డులు సృష్టించడాన్ని ఎంతో ఆస్వాదించేవాడ్నని, అయితే ఎన్టీరామారావు గారు నటించిన విశ్వామిత్ర చిత్రం రావడంతో అన్ని రికార్డులు బద్దలయ్యాయని వెల్లడించారు. దాన్నిబట్టి ఆనాడు తాను అర్థం చేసుకున్నదేంటంటే, రికార్డులు శాశ్వతం కాదని, ఓ వ్యక్తి అనుభవమే శాశ్వతం అని, దాన్ని ఎవరూ కొట్టేయలేరని తెలుసుకున్నానని వివరించారు. అందుకే చిరంజీవి గారంటే తనకు అత్యంత గౌరవం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఎవరెన్ని విజయాలు సాధించినా, ఆ విజయాలను తాము కూడా ఆస్వాదిస్తామని, అన్నయ్య చిరంజీవి తమకు నేర్పించిన సంస్కారం ఇదేనని ఉద్ఘాటించారు. రాజమౌళి విజయాలు సాధించినా తమకు ఆనందమేనని, ఆయన రికార్డులు బద్దలుకొట్టినా తాము కూడా సంతోషిస్తామని చెప్పారు. అలాంటి సందర్భాల్లో తాము అసూయపడబోమని, ఇంకో పది మంది బాగుపడతారన్న భావనతో మరింత ఆనందిస్తామని వెల్లడించారు.

Pawan Kalyan
Syeraa
Chiranjeevi
Rajamouli
  • Loading...

More Telugu News