Andhra Pradesh: చంద్రబాబు, ఆయన మీడియా సంస్థలు తట్టుకోలేకపోతున్నాయి : వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్

  • ఉద్యోగ నియామకాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు
  • బాబు హయాంలో ఒక్క ఉద్యోగమూ భర్తీ చేయలేదు
  • ఇచ్చిన హామీలను జగన్ ఒక్కొక్కటీ నెరవేరుస్తున్నారు

ఏపీలో సచివాలయ ఉద్యోగ నియామకాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ కు చంద్రబాబు ఈరోజు లేఖ రాయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ లేఖ రాసే అర్హత చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. పరీక్షా ఫలితాలు వెలువడ్డాక పేపర్ లీకైయిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశ్వసనీయత లేని చంద్రబాబు మాటలను ప్రజలు పట్టించుకోరని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఉద్యోగాలొస్తే, చంద్రబాబు, ఆయన మీడియా సంస్థలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. బాబు హయాంలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ ఒక్కొక్కటీ నెరవేరుస్తున్నారని, అవినీతి లేని పాలనను అందిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.

Andhra Pradesh
YSRCP
mla
Jogi Ramesh
  • Loading...

More Telugu News