India: దక్షిణాఫ్రికాతో చివరి టి20 మ్యాచ్ కు వాన గండం!

  • నేడు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్
  • ఆతిథ్యమిస్తున్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం
  • మ్యాచ్ సమయానికి వర్షం పడొచ్చంటున్న వాతావరణ విభాగం

ఇటీవల టీమిండియా మ్యాచ్ లకు వరుణుడు తరచుగా అడ్డుతగులుతున్నాడు. తాజాగా, దక్షిణాఫ్రికా జట్టుతో నేడు జరగాల్సిన చివరి టి20 మ్యాచ్ కు వాన ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం చెబుతోంది. ఇరు జట్ల మధ్య మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ కనీసం టాస్ కూడా పడకుండానే వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి 1-0తో సిరీస్ లో ఆధిక్యంలో నిలిచింది. ఇవాళ మూడో టి20 మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. అయితే మ్యాచ్ మొదలయ్యే వేళ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది.

India
South Africa
Cricket
Bengaluru
Chinnaswamy Stadium
  • Loading...

More Telugu News