Adah Sharma: స్వయంవరం ప్రకటించిన అందాల ఆదాశర్మ!

  • వరుస ట్వీట్లు చేసిన నటి
  • కులం ఇతర విషయాలు పట్టించుకోనని వెల్లడి
  • కొన్ని షరతులు వర్తిస్తాయంటూ మెలిక

టాలీవుడ్ నటి ఆదా శర్మ తనకు పెళ్లి కొడుకు కావాలంటూ బహిరంగంగా వెల్లడించారు. అతడి రంగు, కులం, సోషల్ మీడియా ఫాలోయింగ్ ఇవేవీ తాను పట్టించుకోనని ట్వీట్ చేసింది. అయితే ఉల్లిపాయలు తిననివాడు అయ్యుండాలని, ముఖంపై చిరునవ్వు చెదరకుండా మూడు పూటలా వంట అతడే చేయాలని కొన్ని కండిషన్లు పెట్టింది. రెగ్యులర్ గా షేవ్ చేసుకోవాలని, సంప్రదాయ దుస్తులే ధరించాలని షరతులు విధించింది. ఆదా శర్మ అంతటితో ఆగలేదు. మందు, మాంసం ఇంట్లోనూ, బయట నిషేధం అని స్పష్టం చేసింది.

అతడికి తాగేందుకు ఐదు లీటర్ల నీటిని ప్రతి రోజూ అందిస్తానని తెలిపింది. దాంతోపాటే, భారత్ లోని అన్ని భాషల చిత్రాలపైనా సదభిప్రాయం కలిగి ఉండాలని, వాటిని ఆస్వాదించే మనసున్నవాడే తనను మనువాడొచ్చని ట్విట్టర్ లో వెల్లడించింది. మొత్తానికి ఆదా శర్మ ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్లు చేసిందో కానీ, నెటిజన్లు మాత్రం భారీగా స్పందిస్తున్నారు.

Adah Sharma
Tollywood
  • Loading...

More Telugu News