Chandrababu: మీది అనుభవరాహిత్యం...ఆశ్రిత పక్షపాతం : సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

  • మీ పాలనలో ప్రజలు కష్టపడుతున్నారు
  • సచివాలయ పరీక్షా ఫలితాల్లో అవకతవకలే ఇందుకు నిదర్శనం
  • ఏపీపీఎస్పీ ప్రతిష్టకే మచ్చ తెచ్చారు

విపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. మీ పాలనలో ప్రజలు కష్టపడుతున్నారని అందులో పేర్కొన్నారు. అనుభవరాహిత్యం, ఆశ్రిత పక్షపాతంతో మీరు తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణమని లేఖలో స్పష్టం చేశారు. సచివాలయ పరీక్షలో జరిగిన అవకతవకలు ఇందుకు ఒక ఉదాహరణ అని, దీనివల్ల ఏపీపీఎస్పీ ప్రతిష్టే దెబ్బతిన్నదన్నారు.

వైసీపీ వారి బంధువులు, స్నేహితులకే మంచి మార్కులు ఎలా వచ్చాయన్నారు. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, వారి బంధువులకే టాప్‌ ర్యాంకులు రావడం అవకతవకలకు నిదర్శనమన్నారు.  నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణం పరీక్షలు రద్దుచేసి మళ్లీ పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Chandrababu
jagan
letter
sachivalaya exam
  • Loading...

More Telugu News