Gaddalakonda Ganesh: 'ఎల్లువచ్చి గోదారమ్మ...' పాటకు థియేటర్ లో ఎగిరి గంతులు... వీడియో పోస్ట్ చేసిన పూజా హెగ్డే!

  • థియేటర్లలో పాటకు అద్భుత రెస్పాన్స్
  • అభిమానుల ప్రేమ ముందు శ్రమంతా మరచిపోతాం
  • ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేస్తూ పూజా హెగ్డే

అప్పుడెప్పుడో 'దేవత' చిత్రం కోసం శోభన్ బాబు, శ్రీదేవిలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన 'ఎల్లువొచ్చి గోదారమ్మ...' పాటను అదే స్టయిల్ లో హరీశ్ శంకర్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. 'గద్దెలకొండ గణేష్' కోసం వరుణ్ తేజ్, పూజా హెగ్డేలపై ఈ పాటను తీశారు. ఇక దీనికి థియేటర్ లో ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సినీ అభిమానులు ఈ పాట వచ్చినప్పుడు ఎగిరి గంతులేస్తున్నారు.

ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన పూజా హెగ్డే, "ఇందుకోసమే నేను మైళ్లకు మైళ్లు వెళుతుంటాను. ఇటువంటి దృశ్యాలు చూస్తే, బాధలన్నీ మరచిపోతాం. మీ ఆనందం, థియేటర్లలో ఇలా నృత్యం చేయడం చూసి, మేము నిద్రలేని రాత్రులను, ప్రయాణాన్ని, ఎండలో నిలబ‌డి సినిమాలు చేయ‌డాన్ని... వీటన్నింటినీ మీ ప్రేమ ముందు మ‌రిచిపోతాం. ఎల్లువొచ్చి గోదారామ్మ ల‌వ్ యూ" అని కామెంట్ పెట్టింది.

Gaddalakonda Ganesh
Pooja Hegde
Elluvochi
Song
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News