Kajal: తనను పెళ్లి చేసుకోవాలని కోరిన వీరాభిమానికి... కాజల్ ఇచ్చిన సమాధానం వైరల్!

  • కొత్త సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫ్యాన్స్ తో చిట్ చాట్
  • ఇంకాస్త గట్టిగా ప్రయత్నించాలని కాజల్ సలహా
  • అదేమంత సులభమైన విషయం కాదని రిటార్డ్

ప్రస్తుతం కమల్ హాసన్ సరసన 'భారతీయుడు-2' చిత్రంలో నటిస్తున్న కాజల్, విడుదలకు సిద్ధంగా ఉన్న 'ప్యారిస్ ప్యారిస్' ప్రమోషన్ లో బిజీగా ఉంటోంది. తాజాగా, ఆమె, ట్విట్టర్ మాధ్యమంగా ఫ్యాన్స్ తో ముచ్చటించిన వేళ, ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం వైరల్ అయింది.

పలువురి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, తనకు నచ్చిన ఆహారం, ఇష్టమైన ప్రాంతం తదితర విషయాలను పంచుకున్న కాజల్, "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నన్ను వివాహం చేసుకుంటారా? మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నా" అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించేందుకు కాస్తంత సమయం తీసుకున్న కాజల్, "ఇంకా గట్టిగా ప్రయత్నించండి. అయితే, ఇదేమంత సులభమైన విషయం కాదు" అని రిప్లయ్ ఇచ్చింది. కాజల్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Kajal
Twitter
Fans
Question
Viral Answer
  • Loading...

More Telugu News