sachivalayam exam: సచివాలయ పరీక్షల్లో 2,478 మందికి సున్నా మార్కులు

  • నెగెటివ్‌ కారణంగా కొందరికి మైనస్ మార్కులు
  • అత్యధికంగా కేటగిరీ-1లో 1588 మంది
  • పేపరు కఠినంగా ఉండడమే కారణం

గ్రూప్‌-1, 2 స్థాయిలో ప్రశ్నపత్రం ఉందని అభ్యర్థులు అభిప్రాయపడిన గ్రామ, వార్డు సచివాలయం నియామక పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో 2478 మంది సున్నా మార్కులు సాధించడం విశేషం. ముఖ్యంగా కేటగిరీ-1 పరీక్షలో ఎక్కువ మందికి సున్నా మార్కులు రావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో కేటగిరీ -1లో రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల 63 వేల మంది పరీక్ష రాశారు. వీరిలో 1588 మందికి సున్నా మార్కులు రావడం విశేషం.

ఈ పరీక్షలో నెగెటివ్‌ మార్కుల విధానాన్ని నిర్వాహకులు అమలు చేశారు. ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు పోతుంది. ఈ కారణంగా చాలా మందికి మైనస్‌ మార్కులు కూడా వచ్చాయి. కాగా, కేటగిరీ-2 గ్రూప్‌-2లో 33 మంది, గ్రూప్‌-3లో 334 మంది, ఇతర పోస్టుల్లో 523 మందికి సున్నా మార్కు వచ్చాయి.

  • Loading...

More Telugu News