Karnataka: శాండల్ వుడ్ లో స్టార్ వార్... దర్శన్ ఫ్యాన్స్ కు కిచ్చ సుధీప్ స్ట్రాంగ్ వార్నింగ్!

  • సుదీప్ చిత్రాన్ని పైరసీ చేసిన దర్శన్ అభిమాని
  • మేమేమీ గాజులు వేసుకుని లేము
  • తీవ్రంగా హెచ్చరించిన కిచ్చ సుదీప్

శాండల్ వుడ్ లో స్టార్ వార్ మరింత ముదిరింది. స్టార్ హీరోలు దర్శన్, కిచ్చ సుదీప్ అభిమానుల మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్, ఇప్పుడు హీరోలనూ తాకింది. ఇటీవల సుదీప్ నటించిన 'పహిల్వాన్' తరువాత ఈ వార్ మరింతగా పెరిగింది. వీరేశ్ అనే యువకుడు, తాను దర్శన్ అభిమానినని చెప్పుకుంటూ, పహిల్వాన్ సినిమాను పైరసీ చేసి ఆన్ లైన్లో ఉంచడంతో, సుదీప్ ఆగ్రహం తారస్థాయికి చేరింది. "నేను, నా స్నేహితులు చేతికి గాజులు `వేసుకుని లేము" అని హెచ్చరించారు. తనపై కుట్రలు చేస్తున్నవారు కొన్నిరోజులు మాత్రమే ప్రశాంతంగా ఉంటారని, మరోసారి గొడవల జోలికి రావద్దని మండిపడ్డారు.

తనకు సినిమాలు వదిలేస్తే మరో పని లేదని, అందువల్లే మౌనంగా ఉంటున్నానని, కానీ, కొందరు తన మౌనానికి పరీక్ష పెడుతున్నారని అన్నారు. మంచి సినిమాను పైరసీ చేయడం ద్వారా సినిమా కుటుంబ సభ్యులు పడిన కష్టాన్ని వృథా చేశారని అన్నారు. మొత్తం ఘటనల వెనుక ఎవరి కుట్ర ఉందో తనకు తెలుసునని, వారిని నిద్రపోనివ్వబోనని హెచ్చరించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News