JC Diwakar Reddy: ప్రజాధనాన్ని ఎవరు ఆదా చేసినా స్వాగతించాల్సిందే... రివర్స్ టెండరింగ్ పై జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు

  • తక్కువ ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం మంచిదేనన్న జేసీ
  • ఆదా పేరుతో ఆలస్యం చేయొద్దని హితవు
  • పాత కాంట్రాక్టరుకే పనులు దక్కటం పట్ల జేసీ సంతోషం

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  పోలవరం పనుల కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియపై తన అభిప్రాయాలు వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం మంచిదేనని అన్నారు. ప్రజాధనాన్ని ఎవరు ఆదా చేసినా స్వాగతించాల్సిందేనని పేర్కొన్నారు. అలాకాకుండా, ప్రభుత్వం, కాంట్రాక్టర్లు కుమ్మక్కైతే మాత్రం తప్పు అని జేసీ స్పష్టం చేశారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో పాత కాంట్రాక్టరుకే పనులు దక్కడం సంతోషదాయకం అని వ్యాఖ్యానించారు. ఆదా పేరుతో ప్రాజెక్టు పనులు ఆలస్యం చేయడం సరికాదని హితవు పలికారు.

JC Diwakar Reddy
Jagan
Telugudesam
YSRCP
Polavaram
  • Loading...

More Telugu News