Syeraa: న్యాయం జరగకపోతే సైరా ప్రీరిలీజ్ వేడుకను అడ్డుకుంటాం.... ఉయ్యాలవాడ వంశీయుల న్యాయవాది

  • చిరు, రామ్ చరణ్ చీటింగ్ చేశారంటున్న ఉయ్యాలవాడ వంశీయులు
  • జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • అన్ని ఆధారాలు సమర్పించామన్న ఉయ్యాలవాడ బంధువుల న్యాయవాది

సైరా వివాదంలో ఉయ్యాలవాడ వంశీయులు ఆందోళనకు దిగారు. చిరంజీవి, రామ్ చరణ్ లు తమను మోసం చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఉయ్యాలవాడ వంశీయులు అక్కడే బైఠాయించారు. దీనిపై ఉయ్యాలవాడ వంశీయుల న్యాయవాది జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఛీటింగ్ చేశారు కాబట్టే ఫిర్యాదు చేశామని తెలిపారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని వెల్లడించారు. తమ ఫిర్యాదుతో పాటు అన్ని ఆధారాలు సమర్పించామని చెప్పారు. న్యాయం జరగకపోతే సైరా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు.

Syeraa
Chiranjeevi
Ramcharan
Tollywood
  • Loading...

More Telugu News