Syeraa: మమ్మల్ని మోసం చేశారు... చిరంజీవి, రామ్ చరణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉయ్యాలవాడ వంశీయులు

  • వివాదాస్పదంగా మారిన సైరా వ్యవహారం!
  • కథ తీసుకున్నందుకు డబ్బులిస్తామని చెప్పారన్న ఉయ్యాలవాడ వంశీయులు
  • మాట నిలబెట్టుకోలేదని చిరు, చెర్రీలపై ఆగ్రహం

సైరా చిత్రకథ విషయంలో తమతో ముందు కుదుర్చుకున్న ఒప్పందాన్ని చిరంజీవి, రామ్ చరణ్ తుంగలో తొక్కారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు చిరంజీవి నివాసం ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టిన ఉయ్యాలవాడ వంశీకులు తాజాగా పోలీసులను ఆశ్రయించారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథకు అవసరమైన వివరాలను తమ నుంచే సేకరించి, తిరిగి తమ మీదనే కేసులు పెట్టారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నరసింహారెడ్డి గురించిన సమాచారం ఇచ్చినందుకు డబ్బులు ఇస్తామని చెప్పి, మాట తప్పారని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

Syeraa
Uyyalawada
Chiranjeevi
Ramcharan
Tollywood
  • Loading...

More Telugu News