Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన గల్లా జయదేవ్, అఖిలప్రియ

  • హైదరాబాద్ వచ్చిన కిషన్ రెడ్డి
  • కోడెలపై పెట్టిన కేసులను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లిన గల్లా
  • కర్నూలులో రాజకీయదాడులు చేస్తున్నారంటూ అఖిలప్రియ ఫిర్యాదు

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి అఖిలప్రియ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్ లో కలిశారు. గత కొన్నిరోజుల వ్యవధిలో కోడెల శివప్రసాదరావుపై పెట్టిన కేసులను గల్లా జయదేవ్ ఈ సందర్భంగా కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అటు, కర్నూలులో రాజకీయదాడులు చేస్తున్నారని అఖిలప్రియ ఫిర్యాదు చేశారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితులు చక్కదిద్దేలా ఆదేశాలు ఇవ్వాలని కిషన్ రెడ్డిని కోరారు.

Kishan Reddy
Galla Jaydev
Akhilapriya
  • Loading...

More Telugu News