Varun Tej: నీ నటన అమోఘం వరుణ్ తేజ్... 'గద్దలకొండ గణేశ్' కు రాఘవేంద్రరావు ప్రశంసలు

  • విజయవంతమైన గద్దలకొండ గణేశ్
  • వరుణ్ తేజ్ నటనకు విమర్శకులు ఫిదా
  • అభినందనల వర్షం కురిపించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

యువ హీరో వరుణ్ తేజ్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ 'గద్దలకొండ గణేశ్' హిట్ టాక్ తో బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. హరీశ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫ్యాక్షన్ లీడర్ గా వరుణ్ తేజ్ నటనకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా గద్దలకొండ గణేశ్ చిత్రం చూసి వరుణ్ తేజ్ ను అభినందించకుండా ఉండలేకపోయారు.

"నీ నటన అమోఘం వరుణ్ తేజ్. గద్దలకొండ గణేశ్ పాత్రలో నువ్వు పరకాయప్రవేశం చేసిన తీరు నన్ను ముగ్ధుడ్ని చేసింది" అంటూ అభినందనల వర్షం కురిపించారు. అటు దర్శకుడు హరీశ్ శంకర్ ను కూడా ప్రశంసించారు. భలే వినోదాత్మక చిత్రాన్ని అందించావు హరీశ్ శంకర్ అంటూ మెచ్చుకున్నారు. "ముఖ్యంగా వెల్లువొచ్చే గోదారమ్మ పాట పట్ల చాలా సంతృప్తిగా ఫీలయ్యాను. పూజా హెగ్డే ఆ పాటలో అద్భుతంగా చేసింది" అంటూ కితాబిచ్చారు.

Varun Tej
Gaddalakonda Ganesh
Raghavendra Rao
  • Loading...

More Telugu News