Anand Mahindra: ఎప్పుడూ సరదాగా ఉండే ఆనంద్ మహీంద్రా కంటతడి పెట్టిన వేళ..!

  • చేతుల్లేని చిన్నారి ఆహారం తీసుకుంటన్న వీడియో వైరల్
  • వీడియో చూసి కదిలిపోయిన ఆనంద్ మహీంద్రా
  • తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందన్న వ్యాపార దిగ్గజం

సోషల్ మీడియాలో అత్యంత క్రియాశీలకంగా ఉండే వ్యాపారవేత్త ఎవరంటే ఆనంద్ మహీంద్రా పేరే స్ఫురణకు వస్తుంది. సామాజిక అంశాలపైనా, వర్తమాన వ్యవహారాలపైనా చురుకుగా స్పందించే ఆనంద్ మహీంద్రా చాలావరకు సరదా వ్యాఖ్యలతో అలరిస్తుంటారు. అయితే, ఇంటర్నెట్లో ఓ వీడియో చూసిన ఆయనకు కన్నీళ్లు ఆగలేదట! తనే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. పుట్టుకతో రెండు చేతులు లేని ఓ చిన్నారి కాళ్లతో ఆహారం తీసుకుంటున్న వీడియో చూసి తాను చలించిపోయానని వివరించారు.

ఇటీవలే తన మనవడి వద్దకు వెళ్లొచ్చానని, ఇప్పుడీ వీడియోలో ఓ చిన్నారిని చూడగానే తన మనవడే గుర్తుకొచ్చాడని తెలిపారు. ఎలాంటి లోపాలున్నా జీవితాన్ని మనదైన శైలిలో తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని అన్నారు. ఈ వీడియో చూడగానే తీవ్ర భావోద్వేగాలు కలిగినా, ఆ తర్వాత ఆత్మవిశ్వాసం రెట్టింపైందని పేర్కొన్నారు.

Anand Mahindra
Video
  • Error fetching data: Network response was not ok

More Telugu News