Venkaiah Naidu: మన ప్రజాస్వామ్యం ప్రపంచంలోకెల్లా గొప్పది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • హైదరాబాద్ లో ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ నేషనల్ సెమినార్
  • భారతదేశ ఖ్యాతి దశ దిశలా వ్యాపించిందని వ్యాఖ్యలు
  • భారీ స్థాయిలో గృహనిర్మాణం జరుగుతోంది భారత్ లోనే అని వెల్లడి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్ లో నిర్వహించిన ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ నేషనల్ సెమినార్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అత్యంత గొప్పదిగా పేరుతెచ్చుకుందని అన్నారు. నిలకడైన ప్రజాస్వామ్య వ్యవస్థ కారణంగా మన దేశ ఖ్యాతి అన్నివైపులా విస్తరించిందని తెలిపారు. ప్రపంచంలోనే అతి భారీ స్థాయిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో గృహనిర్మాణం జరుగుతోంది భారత్ లోనే అని స్పష్టం చేశారు. ప్రధానమంతి సడక్ యోజన పేరుతో ఆరు లక్షల కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్ల నిర్మాణం జరిగిందని వివరించారు.

Venkaiah Naidu
Hyderabad
  • Loading...

More Telugu News