Jagan: ఇదంతా చూస్తుంటే.. జలయజ్ఞం పేరుతో వైయస్ చేసిన ధనయజ్ఞం గుర్తొస్తోంది: ఆలపాటి రాజా

  • అర్హతలు లేనివారికి కాంట్రాక్టులు అప్పగిస్తున్నారు
  • రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ చేస్తున్నారు
  • అనుకూలమైన వ్యక్తులకు పనులను అప్పగిస్తున్నారు

గతంలో పోలవరం పనులను బాగా చేసిన గుత్తేదార్లను పక్కన పెట్టి, అర్హత లేని వారికి కాంట్రాక్టులను అప్పగిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా మండిపడ్డారు. దేశంలో మిగిలిన 15 జాతీయ ప్రాజెక్టుల కంటే వేగంగా టీడీపీ హయాంలో పోలవరం పనులు జరిగాయని... దీనికి గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా దక్కిందని చెప్పారు.

ఇప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తనకు అనుకూలమైన వారికి పనులను ముఖ్యమంత్రి జగన్ అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరంలో అవినీతి జరగలేదని సాక్షాత్తు పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పిందని తెలిపారు. రాష్ట్రాన్ని జగన్ ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. ఇదంతా చూస్తుంటే... జలయజ్ఞం పేరుతో వైయస్ చేసిన ధనయజ్ఞం గుర్తొస్తోందని అన్నారు.

Jagan
YSR
Alapati Raja
YSRCP
  • Loading...

More Telugu News