Andhra Pradesh: అవినీతిలో ఆరితేరావు కదా.. నిరుద్యోగుల బాధ నీకేం తెలుస్తుందిలే!: విజయసాయిరెడ్డిపై బుద్ధా సెటైర్లు

  • ఏపీలో గ్రామ సచివాలయం రగడ
  • చంద్రబాబు వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఆగ్రహం
  • సాయిరెడ్డి విమర్శలకు బుద్ధా వెంకన్న కౌంటర్

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ సచివాలయం ఉద్యోగాల పరీక్షల విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఈ పరీక్ష రాసిన విద్యార్థులతో ఏవేవో ఆరోపణలు చేయించేందుకు చంద్రబాబు అనుకూల మీడియా ప్రయత్నించి విఫలమైందని సాయిరెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. దీంతో సాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. గ్రామ సచివాలయం పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని స్వయంగా ఏపీ పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన మాట నిజం కాదా? అని టీడీపీ నేత ప్రశ్నించారు.

పేపర్ లీక్ కారణంగా ఉద్యోగాలు సంపాదించిన వారికి విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ లీకులతో ధైర్యం చెబుతున్నారని దుయ్యబట్టారు. కానీ ఇలాంటి చర్యలతో విజయసాయిరెడ్డి 18 లక్షల మంది నిరుద్యోగులను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి రాజకీయాల్లో ఆరితేరిన విజయసాయిరెడ్డికి నిరుద్యోగుల బాధ తెలియదని విమర్శించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో స్పందించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News