Crime News: ఖాతాదారులను ముంచేసిన చిట్‌ఫండ్‌ సంస్థ!

  • సుమారు రూ. 20 కోట్ల వరకు దగా
  • బాధ తట్టుకోలేక ఒకరి ఆత్మహత్యా యత్నం
  • పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఘటన

భవిష్యత్తు అవసరాల కోసం, ఆసరాగా ఉంటుందన్న లక్ష్యంతో రూపాయి రూపాయి కూడబెట్టి మరీ కట్టిన ఖాతాదారులను ఓ చిట్‌ఫండ్‌ సంస్థ దారుణంగా మోసం చేసింది. వందలాది మంది ఖాతాదారుల నుంచి దాదాపు 20 కోట్ల రూపాయలు వసూలు చేసి దుకాణం ఎత్తేసింది.

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు కేందంగా ఏసీఆర్‌ చిట్‌పండ్‌ సంస్థను కొందరు నిర్వహిస్తున్నారు. నమ్మకంగా వ్యవహరించడంతో పలువురు ఖాతాదారులు వీరి వద్ద చిట్ లు కట్టారు. తీరా డబ్బు చెల్లించాల్సిన సమయానికి నిర్వాహకులు పరారు కావడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇదిలావుండగా పెద్దమొత్తంలో డబ్బుకట్టి నష్టపోయిన ఓ బాధితుడు విషయం తెలిసి ఆత్మహత్యా యత్నం చేశాడు.

Crime News
chitfund organisation
Rs.20 crores
closed
  • Loading...

More Telugu News