TTD: స్వామివారి బ్రహ్మోత్సవాలకు రండి: సీఎం జగన్‌కు టీటీడీ ఆహ్వానం

  • ఆహ్వాన పత్రిక అందజేసిన చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈఓ సింఘాల్‌
  • ఈనెల 30 నుంచి స్వామివారి వార్షిక ఉత్సవాలు
  • 29న అంకురార్పణతో కార్యక్రమాలకు శ్రీకారం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్‌, అధికారులు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానపత్రిక అందించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌లు, ఇతర అధికారులు వెళ్లి సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈనెల 29వ తేదీన అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. 30వ తేదీ నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి.

TTD
brhmostavam
CM Jagan
EO
subbareddy
  • Loading...

More Telugu News