lingamaneni guest house: పంచాయతీ అనుమతులతోనే కరకట్టపై గెస్ట్‌హౌస్‌ నిర్మాణం: లింగమనేని స్పష్టీకరణ

  • చంద్రబాబు నివాసానికి సీఆర్‌డీఏ నోటీసులు
  • దీనిపై వివరణ ఇచ్చిన ఇంటి యజమాని
  • అప్పటికి సీఆర్‌డీఏ లేనందున పంచాయతీ అనుమతి

ఉండవల్లి పంచాయతీ నుంచి నిబంధనల మేరకు అన్ని అనుమతులు తీసుకునే కృష్ణా నది కరకట్టపై గెస్ట్‌ హౌస్‌ నిర్మించామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న భవన యజమాని లింగమనేని రమేష్‌ స్పష్టం చేశారు. ఈ ఇల్లు అక్రమ నిర్మాణమని, వారం రోజుల్లోగా ఖాళీ చేయాలని తాజాగా సీఆర్‌డీఏ అధికారులు లింగమనేని పేరుతో మరోసారి భవనానికి నోటీసులు అంటించారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ఫ్లోర్‌, స్విమ్మింగ్‌పూల్‌, ఫస్ట్‌ఫ్లోర్‌లోని డ్రెసింగ్‌ రూమ్‌ నిర్మించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

దీంతో ఇంటి యజమానిగా లింగమనేని స్పందించారు. తాము నిర్మాణం చేపట్టే నాటికి సీఆర్‌డీఏ లేదని, అందువల్ల ఉండవల్లి పంచాయతీ పరిధిలోని ఇల్లు కాబట్టి అప్పటి పంచాయతీ అనుమతి తీసుకునే నిర్మాణం చేపట్టామని తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News