Revanth Reddy: రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్

  • రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది
  • రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం
  • జనసేన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడం తప్పే

ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి తప్పు పట్టారు. అసెంబ్లీలో మొదటి రెండు రోజులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరుతో పార్టీ గ్రాఫ్ పెరిగిందని... మూడో రోజు వచ్చి రేవంత్ మాట్లాడిన మాటలతో పార్టీ గ్రాఫ్ పడిపోయిందని ఆయన అన్నారు. శాసనసభలో ఎప్పుడు ఏం మాట్లాడాలనేది ఎమ్మెల్యేలే నిర్ణయించుకుంటారని చెప్పారు. యురేనియం అంశంలో ఏఐసీసీకి వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ లు ముందే నివేదిక ఇచ్చారని తెలిపారు. సంపత్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో రేవంత్ వ్యవహారంపై చర్చించామని... ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. యురేనియం అంశంపై జనసేన నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడం ముమ్మాటికే తప్పేనని అభిప్రాయపడ్డారు.

Revanth Reddy
Kodanda Reddy
Sampath
Congress
Janasena
  • Loading...

More Telugu News