Chandrababu: చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయాలని మరోసారి నోటీసులు

  • సంతృప్తికరంగా లేని లింగమనేని  వివరణ
  • నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం 
  • వారం రోజుల్లో నివాసాన్ని ఖాళీ చేయాలని నోటీసులు

ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని వారం రోజుల్లో ఖాళీ చేయాలని సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను చంద్రబాబు నివాసం గోడకు అతికించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నోటీసులో పేర్కొన్నారు.  గతంలో ఇచ్చిన నోటీసులను కూడా ప్రస్తుత నోటీసులో సీఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులకు ఇంటి యజమాని లింగమనేని రమేశ్ వివరణ ఇచ్చారని... అయితే ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ లను నిర్మించారని తెలిపారు. 

Chandrababu
Telugudesam
Lingamaneni
  • Loading...

More Telugu News