Uttar Pradesh: అంబులెన్స్ ఇవ్వని ఆసుపత్రి.. భార్య మృతదేహాన్ని 45 కిలోమీటర్ల మేర రిక్షాలో తీసుకెళ్లిన భర్త

  • చికిత్స పొందుతూ మృతి చెందిన భార్య
  • అంబులెన్స్ ఏర్పాటు చేయమన్నా కనికరించని ఆసుపత్రి సిబ్బంది
  • రిక్షాలో వేసుకుని లాక్కుంటూ ఇంటికి చేర్చిన  భర్త

అంబులెన్స్ అందుబాటులో లేక ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని రిక్షాలో వేసుకుని ఏకంగా 45 కిలోమీటర్లు తీసుకెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. శంకర్‌గఢ్‌లోని సరూర్‌గంజ్‌కు చెందిన కల్లూ భార్య తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను వెంటనే ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్)లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడామె చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచింది. దీంతో తన భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయమని ఆసుపత్రి సిబ్బందిని కల్లూ బతిమాలాడు. అయినా అతడి గోడును పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. దీంతో చేసేది లేక భార్య మృతదేహాన్ని రిక్షాలో వేసుకుని ప్రయాగ్ రాజ్ నుంచి ఇంటి వరకు ఏకంగా 45 కిలోమీటర్లు తీసుకెళ్లాడు.

Uttar Pradesh
ambulance
wife
husband
rickshaw
  • Loading...

More Telugu News