Harish Shankar: విడుదలకు ముందు రోజు టైటిల్ మారిన చిత్రం మాదే అనుకుంటా: హరీశ్ శంకర్

  • ప్రేక్షకుల ముందుకు వచ్చిన గద్దలకొండ గణేశ్
  • స్పందించిన దర్శకుడు హరీశ్ శంకర్
  • తొలి సినిమా ఫ్లాపైనప్పుడు కూడా ఇంతగా బాధపడలేదని వెల్లడి

'వాల్మీకి'గా మొదలై విడుదలకు వచ్చేసరికి 'గద్దలకొండ గణేశ్'గా పేరు మార్చుకున్న చిత్రం ఇప్పుడు హిట్ టాక్ తో దూసుకెళుతోంది. వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో నటించిన ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీనిపై దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ, 'విడుదలకు ముందురోజు టైటిల్ మార్చుకున్న చిత్రం ఇదే అనుకుంటా' అంటూ వ్యాఖ్యానించాడు. ఇది కూడా ఓ రకంగా చరిత్ర సృష్టించినట్టేనని అభిప్రాయపడ్డాడు.

తన తొలి సినిమా 'షాక్' ఫ్లాపైనప్పుడు కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా తర్వాత ప్రాజెక్టు గురించి ఆలోచించానని, కానీ వాల్మీకి టైటిల్ మార్చాల్సివచ్చినప్పుడు, అది కూడా రేపు సినిమా రిలీజవుతుందనగా ఇప్పటికిప్పుడు మరో పేరు పెట్టాల్సిరావడం తనను బాగా బాధించిందని వెల్లడించాడు. వాల్మీకి అనే పేరుతోనే సినిమా రిలీజై ఉంటే సక్సెస్ ను పరిపూర్ణంగా ఆస్వాదించేవాళ్లమని హరీశ్ తెలిపాడు.

Harish Shankar
Gaddalakond Ganesh
Valmiki
  • Loading...

More Telugu News