Andhra Pradesh: సీఎం జగన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు

  • కోర్టుకు హాజరుపై వ్యక్తిగత మినహాయింపు కోరిన జగన్
  • తమ వాదనలు వినిపించిన జగన్ తరఫు న్యాయవాది
  • ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు

ఏపీ సీఎం జగన్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కోర్టుకు హాజరుపై తనకు వ్యక్తిగత మినహాయింపు కోరుతూ వైసీపీ అధినేత జగన్ గతంలో హైకోర్టులో దాఖలు చేసిన  పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో, ఇదే విషయమై సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఇదే పిటిషన్ ను గతంలో హైకోర్టు కొట్టివేసినందున మళ్లీ ఎలా విచారణ చేపడతామని సీబీఐ న్యాయస్థానం ప్రశ్నించింది. తమ పరిస్థితులు మారినందున తమ పిటిషన్ ను విచారణకు స్వీకరించాలని జగన్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి మేరకు ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది.

Andhra Pradesh
cm
jagan
cbi court
  • Loading...

More Telugu News