East Godavari: వరద ప్రవాహం అధికంగా ఉంది.. బోటు తీయడం కష్టమవుతుంది: మంత్రి కన్నబాబు

  • గల్లంతైన వారి సంఖ్య 77గా తేలింది
  • ఇప్పటి వరకు 35 మృతదేహాలను వెలికితీశారు
  • ఇంకా 16 మంది మృతదేహాలు దొరకాల్సి ఉంది

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో పడవ బోల్తా ఘటనకు సంబంధించి తాజా వివరాలను ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదం సంభవించిన సమయంలో బోటులో గల్లంతైన వారి సంఖ్య 77గా లెక్క తేలిందని చెప్పారు.

ఇప్పటి వరకు 35 మృతదేహాలను వెలికితీశారని అన్నారు. విశాఖకు చెందిన ఓ మహిళ మృతదేహం లభ్యమైందని, ఇంకా 16 మంది మృతదేహాలు దొరకాల్సి ఉందని అన్నారు. ఆ మృతదేహాలు బోటులోనే ఉండొచ్చని భావించారు. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రమాదానికి గురైన బోటును బయటకు తీయడం కష్టమవుతుందని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. బోటు ప్రమాదం సమయంలో 27 మందిని రక్షించిన మత్స్యకారులను ఆయన అభినందించారు.

East Godavari
kachuluru
Minister
kannababu
  • Loading...

More Telugu News