ABN: ఏబీఎన్, టీవీ5 ప్రసారాలు ఆపివేత కేసు.. పలువురికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు

  • ఏపీలో పలు ప్రాంతాల్లో నిలిచిన ప్రసారాలు
  • ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్
  • సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ట్రాయ్ కి నోటీసులు

ఏపీలో ఏబీఎన్, టీవీ5 ఛానళ్ల ప్రసారాలు పలు ప్రాంతాల్లో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ ఛానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలంటూ కె.వెంకటేశ్ అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ట్రాయ్, మాస్టర్ ఛానల్ కమ్యూనికేషన్ నెట్ వర్క్, శ్రీ డిజిటల్ నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. ప్రసారాల నిలిపివేతకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది.  తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News