Pakistan: తీరుమారకుంటే పాకిస్థాన్‌పై ఫిర్యాదు: భారత్ విదేశాంగ శాఖ స్పష్టీకరణ
- ప్రధాని మోదీ విమానాన్ని అనుమతించక పోవడంపై ఆగ్రహం
- దాయాది దేశం తన విధానాలు మార్చుకోవాలి
- విదేశాంగ నిబంధనలను గౌరవించడం నేర్చుకోవాలి
భారత ప్రధాని నరేంద్ర మోదీ విమానాన్ని తమ గగన తలం నుంచి అనుమతించబోమని పాకిస్థాన్ ప్రకటించడంపై అంతర్ఞాతీయ పౌర విమానయాన సంస్థకు ఫిర్యాదు చేయనున్నట్లు బారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘పాకిస్థాన్ పాత అలవాట్లనే కొనసాగిస్తోంది. విదేశీ సంబంధాల విషయంలో తీరు మార్చుకోవడం లేదు. అంతర్జాతీయ సమాజానికి సంబంధించిన అంశాల్లో పాకిస్థాన్ పద్ధతిగా వ్యవహరించాలి. ఇప్పటికైనా పాకిస్థాన్ వాస్తవాన్ని గుర్తించి తన బుద్ధి మార్చుకుంటుందని ఆశిస్తున్నాం. లేదంటే ఫిర్యాదు చేయక తప్పదు’ అంటూ భారత విదేశాంగ శాఖ సెకట్రరీ విజయ్ గోఖలే స్పష్టం చేశారు.
వారం రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లనున్నారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నాటి నుంచి భారత్‌పై రగిలిపోతున్న పాకిస్థాన్ తమ గగన తలంలోకి భారత విమాన ప్రవేశాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ప్రయాణించే విమానానికి కూడా అనుమతించ లేదు. తాజాగా ప్రధాని ప్రయాణించే విమానాన్ని అనుమతించమని స్పష్టం చేసింది. పాకిస్థాన్ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ తన బుద్ధి మార్చుకుని అంతర్జాతీయ సమాజంలో తానూ భాగంగా వ్యవహరించాలని హితవు పలికింది.