Chandrababu: ప్రజలకు, వ్యవస్థలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్

  • సీబీఐ ఒక చెత్త అని గతంలో చంద్రబాబు అన్నారు
  • గవర్నర్ వ్యవస్థ కూడా అనవసరమని చెప్పారు
  • ఈ రెండు విషయాల్లో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. సీబీఐ ఒక చెత్త అంటూ గతంలో చంద్రబాబు వ్యాఖ్యానించారని... దీనికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నెంబర్ 109ని కూడా తీసుకొచ్చారని తెలిపారు. గవర్నర్ వ్యవస్థను కూడా తాను పరిగణనలోకి తీసుకోనని, ఆ వ్యవస్థ అవసరం లేదని చెప్పారని మండిపడ్డారు. ఇప్పుడు ఈ రెండు విషయాల్లో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని... ప్రజలకు, వ్యవస్థలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Chandrababu
Telugudesam
CBI
Governor
Vishnu Vardhan Reddy
BJP
  • Loading...

More Telugu News