Delhi BJP: పార్టీ కార్యాలయంలో భార్య చెంప ఛెళ్లుమనిపించిన బీజేపీ నేత.. వీడియో చూడండి

  • భార్య సరితా చౌదరిపై చేయి చేసుకున్న అజాద్ సింగ్
  • గతంలో దక్షిణ ఢిల్లీ మేయర్ గా పని చేసిన సరితా చౌదరి
  • కొన్నేళ్లుగా కోర్టులో నడుస్తున్న విడాకుల వ్యవహారం

తన భార్యపై పార్టీ కార్యాలయంలోనే ఓ బీజేపీ నేత చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ పరిధిలోని మెహ్రౌలీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అజాద్ సింగ్ తన భార్య సరితా చౌదరి చెంపను ఛెళ్లు మనిపించారు. దక్షిణ ఢిల్లీ మేయర్ గా గతంలో సరితా చౌదరి పని చేయడం గమనార్హం. తన భార్య నుంచి విడాకులు కోరుతూ అజాద్ సింగ్ కోర్టులో పిటిషన్ వేశారని ఈ సందర్భంగా బీజేపీ నేతలు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల సంసిద్ధతకు సంబంధించి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సమావేశం ముగిసిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఢిల్లీ ఇన్ ఛార్జిగా జవదేకర్ వ్యవహరిస్తున్నారు.

భార్యాభర్తల మధ్య విడాకుల వ్యవహారం కొన్నేళ్లుగా కోర్టులో నడుస్తోందని... అయితే, బహిరంగ ప్రదేశంలో వీరిద్దరూ ఇలా గొడవ పడతారని తాము ఊహించలేదని ఓ సీనియర్ నేత తెలిపారు. గొడవ నేపథ్యంలో అజాద్ సింగ్ ను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించి... వికాస్ తన్వార్ కు బాధ్యతలను అప్పగించారు. మరోవైపు, ఈ ఘటనపై పార్టీ అంతర్గత విచారణకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి ఆదేశించారు.

Delhi BJP
BJP
Mehrauli District
Azad Singh
Wife
Sarita
Slap
  • Error fetching data: Network response was not ok

More Telugu News