Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కీర్తి సురేశ్ 'మైదాన్' సినిమా 
  • బాలీవుడ్ కోసం 'సైరా' ప్రీమియర్
  • మహేశ్ బాబుతో మరోసారి    

*  దక్షిణాది భాషా చిత్రాలలో బిజీగా వున్న కథానాయిక కీర్తి సురేశ్ తొలిసారిగా ఓ హిందీ చిత్రంలో నటిస్తోంది. అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పేరు 'మైదాన్'. భారత ఫుట్ బాల్ పితామహుడిగా పేరుగాంచిన సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్ గా రూపొందే ఈ చిత్రానికి అమిత్ రవీంద్ర నాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
*  చిరంజీవి నటించిన 'సైరా' చిత్రాన్ని అక్టోబర్ 2న భారీ ఎత్తున వివిధ భాషాల్లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో బాలీవుడ్ ప్రముఖుల కోసం ముంబైలో ప్రీమియర్ షోను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట.
*  ఆమధ్య మహేశ్ తో 'మహర్షి' చిత్రాన్ని చేసిన దర్శకుడు వంశీ పైడిపల్లి మరో చిత్రానికి రెడీ అవుతున్నాడు. తన తదుపరి చిత్రాన్ని కూడా మహేశ్ తోనే చేయడానికి కథను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Keerthi Suresh
Ajay Devagan
Chiranjivi
Saira
Mahesh Babu
  • Loading...

More Telugu News