justice nooty ramamohana rao: సంచలన వీడియోను బయటపెట్టిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు కోడలు సింధుశర్మ

  • ఏప్రిల్ 20న సింధుశర్మపై భర్త, అత్తమామల దాడి
  • చెంపలు వాయించి, చేతులు విరిచేసిన రిటైర్డ్ జడ్జి
  • తీవ్రంగా కొట్టి, దుస్తులు చించేసిన వైనం

తనపై మామ, హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు, భర్త వశిష్ట, అత్త కలిసి దాడిచేసిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను సింధుశర్మ బయటపెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న తనపై ఇంట్లోనే విచక్షణ రహితంగా దాడిచేశారని, తీవ్రంగా హింసించారని సింధుశర్మ పేర్కొన్నారు. తన జీవితంలో ఆ రాత్రి కాళరాత్రిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె విడుదల చేసిన ఫుటేజీలో భర్త, అత్తమామలు సింధుశర్మను దారుణంగా కొడుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది. నూతి రామ్మోహన్ అయితే కోడలు చెంపలను పలుమార్లు వాయించడం, చేతులు విరిచేయడం, కాళ్లతో తొక్కడం కనిపించింది.

పెళ్లయిన దగ్గరి నుంచి అత్తమామలు తనను వేధిస్తున్నారని సింధు ఆరోపించారు. ఆ రోజు ముగ్గురూ కలిసి తనను తీవ్రంగా కొట్టారని, దుస్తులు చించేశారని అన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లమని కోరితే పిచ్చాసుపత్రికి తరలిస్తామని హెచ్చరించారని అన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్తూ కూడా ఇంటి ఆవరణలో తనపై మరోమారు దాడి జరిగిందన్నారు. ఈ ఘటనపై అప్పట్లో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. తన భర్త వస్తాడని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, అయినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. రామ్మోహన్‌రావు తన పలుకుబడిని ఉపయోగించి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తను విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

justice nooty ramamohana rao
sindhu sharma
attack
  • Loading...

More Telugu News