Hero: హీరో వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ సినిమా పేరు మార్పు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-89c5a74ff197fe88d0cfc119e2a9b8ce3f5b53e9.jpg)
- రేపు విడుదల కానున్న ‘వాల్మీకి’
- బోయ సామాజికవర్గం అభ్యంతరంతో టైటిల్ మార్పు
- ‘వాల్మీకి’ పేరును ‘గద్దలకొండ గణేశ్’గా మార్పు
హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘వాల్మీకి’ రేపు విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ సినిమా టైటిల్ ను మారుస్తున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ‘వాల్మీకి’ సినిమా పేరును ‘గద్దలకొండ గణేశ్’గా మార్చినట్టు తెలిపారు. కాగా, ‘వాల్మీకి’ టైటిల్ పై బోయ సామాజికవర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ టైటిల్ తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉందని బోయహక్కుల పోరాటసమితి హైకోర్టులో పిటిషన్ వేసింది.