cm: సీఎం జగన్ పనులతో టీటీడీ పవిత్రత ప్రశ్నార్థకమైంది: టీడీపీ ఎమ్మెల్సీ మంతెన

  • టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు 
  • స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ టీటీడీలో ఎందుకు అమలు చేయలేదు?
  • ఏపీ సీఎం జగనా? కేసీఆరా?

సీఎం జగన్ పనులతో టీటీడీ పవిత్రత ప్రశ్నార్థకమైందని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విమర్శించారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు. టీటీడీని తెలంగాణకు అప్పగించేలా జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన జగన్, టీటీడీలో ఈ రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగనా? కేసీఆరా? అని ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

cm
jagan
Telugudesam
Mlc
Mantena
  • Loading...

More Telugu News