Siddipet District: హుజూర్ నగర్ ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుంది: లక్ష్మణ్

  • నోటిఫికేషన్ వెలువడ్డాక మా అభ్యర్థిని ప్రకటిస్తాం 
  • సింగరేణికి టీ ప్రభుత్వం రూ.8 వేల కోట్లు బకాయి పడింది
  • కార్మికులకు బోనస్ ఎలా చెల్లిస్తారు? అప్పు చేస్తారా?

హుజూర్ నగర్ ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తమ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల బోనస్ గురించి ప్రస్తావించారు. ముప్పై శాతం బోనస్ వస్తుందని కార్మికులు ఆశించారు కానీ, 28 శాతం మాత్రమే ఇచ్చిందని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలను అప్పుల్లోకి నెట్టారని ఆరోపించారు. సింగరేణికి చెందిన ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేరని, కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. సింగరేణికి తెలంగాణ ప్రభుత్వం రూ.8 వేల కోట్లు బకాయి పడిందని, మరి, కార్మికులకు బోనస్ డబ్బులు ఎలా చెల్లిస్తారు? అప్పు చేస్తారా? అని ప్రశ్నించారు.

Siddipet District
Huzurunagar
BJP
Lakshman
  • Loading...

More Telugu News