Kodela: కోడెల ఆత్మహత్యకు చంద్రబాబే కారణం: తలసాని

  • కోడెలను చంద్రబాబు మానసికంగా హింసించారు
  • పార్టీ సమావేశాలకు దూరం పెట్టారు
  • అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కోడెలను చంద్రబాబు మానసికంగా హింసించారని విమర్శించారు.

పార్టీ సమావేశాలకు కోడెలను దూరం పెట్టారని, చివరకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు. తప్పంతా ఆయన వైపే పెట్టుకుని, సీఎం జగన్ పై తప్పును నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కోడెల అంతిమయాత్రలో ప్రజలకు దండాలు పెడుతూ, సానుభూతిని పొందే ప్రయత్నం చేశారని అన్నారు. కోడెలపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టినా... సోదాలు, విచారణ పేరుతో హింసించలేదని చెప్పారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

Kodela
Chandrababu
Talasani
Jagan
Telugudesam
TRS
YSRCP
  • Loading...

More Telugu News