Singareni: సింగరేణి కార్మికుల తరపున సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేస్తున్నా: ఎమ్మెల్యే వనమా

  • కార్మికులకు బోనస్ ప్రకటించడంపై హర్షం
  • గత ఏడాదితో పోలిస్తే నలభై వేలకు పైగా పెంచారు
  • బీజేపీకి భయపడి బోనస్ పెంచారనడం అపోహ

సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్ ప్రకటించడంపై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల తరపున సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేస్తున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ పాయింట్ వద్ద ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణిలోని ప్రతి కార్మికుడికి రూ.1,00,899 చొప్పున బోనస్ ప్రకటించారని, గత ఏడాది ఇచ్చిన బోనస్ తో పోలిస్తే నలభై వేలకు పైగా పెంచారని కొనియాడారు. బోనస్ పెంచడంపై బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన తిప్పికొట్టారు. బీజేపీకి భయపడి బోనస్ పెంచారనడం ఓ అపోహ అని, అసలు, తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మరో ఇరవై ఏళ్లు కేసీఆరే సీఎంగా వుంటారని వ్యాఖ్యానించారు.

Singareni
cm
kcr
kothagudem
mla
Vanama
  • Loading...

More Telugu News